
తాజా వార్తలు
హుజూర్నగర్ బహిరంగ సభలో ఉత్తమ్
సూర్యాపేట: తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణను దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సాకారమయ్యే దశలో వచ్చి ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని కేటీఆర్‌నుద్దేశించి విమర్శలు చేశారు. 17 ఏళ్లకే సైన్యంలో చేరి శత్రు దేశాలతో పోరాడి వచ్చిన వ్యక్తిని తానని గుర్తుచేశారు. హుజూర్‌నగర్‌లో పద్మావతిని 30 వేల మెజార్టీతో గెలవకపోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఉప ఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవాలని తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ నేతలు భట్టి, కోమటిరెడ్డి, సీతక్క, పొన్నం, కొండా సురేఖ, శ్రీదర్ బాబు తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ఎస్సీలకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఉత్తమ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎస్సీలను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. మే నెలలో ఇస్తానన్న ‘రైతు బంధు’ డబ్బులు నేటికీ ఇవ్వలేదని, ఎన్నికలు జరిగిన ఏడాది పూర్తైనా రుణమాఫీ ఊసే ఎత్తలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
