close

తాజా వార్తలు

సైరా, 100% కాదల్‌, అసురన్‌.. ఒకేసారి..!

తొలివారంలో మూడు చిత్రాల విడుదల

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఈ నెల తొలి వారంలోనే పెద్ద పోటీ నెలకొంటోంది. తమిళ ప్రేక్షకులకు నిండైన వినోదాన్ని పంచడానికి మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’గా ఈ నెల రెండో తేదీన తెరపైకి వస్తోంది. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అసురన్‌’, జీవీ ప్రకాశ్‌ నటించిన ‘100% కాదల్‌’ 4వ తేదీన విడుదల అవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘సైరా’ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి అన్ని రాష్ట్రాలకు వెళ్లి సినిమా ప్రమోషన్‌ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తమిళంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. మెగాస్టార్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా, సుదీప్‌లు ఉన్నందున ప్రేక్షకులు దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగులో విజయం సాధించిన ‘100% లవ్‌’ చిత్రమే ‘100% కాదల్‌’. ఆ రకంగా తీసుకుంటే రెండు తెలుగు కథలు ఈ వారం ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి. ఈ చిత్రంలో నటించిన జీవీ ప్రకాశ్‌ యువతలో మంచి గుర్తింపు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’తో ఆకట్టుకున్న షాలినిపాండే ‘100% కాదల్‌’తో తమిళ యువకుల మనసులో చోటు సంపాదించుకోవాలని ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, ‘అసురన్‌’లో భిన్నమైన గెటప్‌లో నటించిన ధనుష్‌ జాతీయ అవార్డుపై దృష్టి పెట్టిపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు నెల క్రితమే ప్రకటించారు. 500పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతున్నట్లు సమాచారం. వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌ అంటేనే తప్పకుండా వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తారు. మొత్తానికి ఈ వారం వెండితెరపై స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రేమికుడు, అసురుడు పోటీ పడుతున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.