close

తాజా వార్తలు

పాక్‌కు ఎదురుదెబ్బ..ఆ నగదు నిజాం వారసులకే..

మరోసారి అవమానానికి గురైన పాకిస్థాన్‌

లండన్‌: హైదరాబాద్‌ నిజాంకు సంబంధించిన ఏడు దశాబ్దాల నాటి ఓ కేసులో భారత్‌కు ఊరట లభించింది. డెబ్భై ఏళ్ల క్రితం నిజాం బ్రిటన్‌కు తరలించిన ఒక మిలియన్‌ పౌండ్ల సొమ్ము (ఇప్పటి విలువ ప్రకారం 35 మిలియన్‌ పౌండ్లు) భారత్‌కే దక్కుతుందని హైకోర్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ సంపదపై పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. నిజాం సంపదపై తమకే అధికారం ఉందని 70 ఏళ్లుగా పాకిస్థాన్‌ వాదిస్తోందని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. యూకే కోర్టు తాజా తీర్పుతో పాకిస్థాన్‌ అంతర్జాతీయ సమాజం దృష్టిలో మరోసారి అవమానానికి గురయినట్లయింది. 
1948లో ఏడో నిజాం పేరుపై లండన్‌లోని బ్యాంకులో ఒక మిలియన్‌ పౌండ్ల సొమ్ము జమ అయింది. ఈ చరిత్రాత్మకమైన కేసు 70 ఏళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. ఓ వైపు భారత్‌తో పాటు నిజాం వారసులైన ముఖర్రమ్‌ ఝా, ముప్ఫఖమ్‌ ఝా ఈ సంపదపై పోరాడుతుండగా.. మరోవైపు పాకిస్థాన్‌ ఆ ఆస్తి తమకే చెందుతుందని వాదించింది. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో కలవక ముందు నిజాంకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేశామని, అందుకు చెల్లింపుగా ఈ సొమ్ము తమకే చెందుతుందని పాకిస్థాన్‌ అంటూ వస్తోంది. అయితే 1948లో ఏడో నిజాం 1 మిలియన్‌ పౌండ్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు యూకేలోని అప్పటి పాకిస్థాన్‌ రాయబారి హబీబ్‌ ఇబ్రహీమ్‌ రహీంతుల్లాకు పంపారు. ఆ సొమ్మును తనపై ఉన్న విశ్వాసంతో మాత్రమే నిజాం పంపారని రహీంతుల్లా ఓ సందర్భంలో అంగీకరించారు. మరోవైపు హైదరాబాద్‌ సంస్థానంపై పోలీసు చర్య జరిగిన సమయంలో భయపడిన నిజాం తాను ఆ సొమ్మును పంపలేదని, తన పేరుపై మరెవరో పంపారని అన్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ సొమ్ము లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంకులో ఉంది. దాని విలువ ఇప్పుడు 35 మిలియన్‌ పౌండ్లు ( సుమారు రూ.306 కోట్లు). ఈ కేసులో నిజాం వారసులకు భారత ప్రభుత్వం చేయూతనివ్వడంతో కేసు నెగ్గగలిగారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.