
తాజా వార్తలు
దిల్లీ: పారిశ్రామిక పాలసీల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక సమాఖ్య ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన ఇండియా ఎకానమిక్ సమ్మిట్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో భాగంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ నేషన్లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై కేటీఆర్ ప్రసంగించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందని కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారానే ఈ ప్రగతి సాధ్యమైందని వివరించారు. దార్శనిక నాయకత్వం ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా, వేగంగా అభివృద్ధిని సాధిస్తాయని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యపడుతుందని చెప్పారు. ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన టీఎస్ ఐసాస్ చట్టంతో ఇప్పటికే 11 వేలకు పైగా అనుమతులను ఇచ్చామని సదస్సులో కేటీఆర్ వివరించారు. ఇందులో 8,400లకు పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని స్పష్టం చేశారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజిసెస్ ర్యాంకుల్లో రెండుసార్లు తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
