close

తాజా వార్తలు

బ్యాంకులకు ఇంకా 10రోజులు సెలవులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్టోబర్‌ నెలలో బ్యాంకులకు అత్యధిక సెలవు రోజులు ఉన్నాయి. శని, ఆదివారాలకు తోడు దసరా, దీపావళి, మరికొన్ని ప్రత్యేక రోజులు ఈ నెలలోనే ఉండడంతో మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పటికే గాంధీ జయంతి(అక్టోబర్‌ 2) సెలవు ముగియగా ఇంకా 10రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండుగ సీజన్ కావడంతో డబ్బులతో అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగదు అవసరమున్న వారు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సెలవులు అన్ని ప్రైవేట్‌, పబ్లిక్‌ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయి. అయితే ఆయా బ్యాంకుల ఐచ్ఛిక సెలవు దినాల్ని కూడా ఓసారి పరిశీలించాలని అధికారులు సూచించారు.

అక్టోబర్ -2  గాంధీ జయంతి (ముగిసింది)
అక్టోబర్ -6 ఆదివారం
అక్టోబర్ -7 మహర్నవమి
అక్టోబర్ -8 దసరా
అక్టోబర్ -12 రెండో శనివారం
అక్టోబర్ -13 ఆదివారం
అక్టోబర్ -20 ఆదివారం, వాల్మీకి జయంతి
అక్టోబర్ -26 నాలుగో శనివారం
అక్టోబర్ -27 దీపావళి
అక్టోబర్ -28 గోవర్ధన్ పూజ
అక్టోబర్ -29 భాయ్ దూజ్(యమ విదియ)

ఇందులో అక్టోబర్‌ 26, 27, 28 వరుసగా మూడురోజుల పాటు సెలవులు ఉండడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.