close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఆర్‌జీయూకేటీ, బాసర

బాసర (నిర్మల్‌)లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గెస్ట్‌ ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌), గెస్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌.
విభాగాలు: సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ & ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ), కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, తదితరాలు.
అర్హత: డిగ్రీ, ఎంసీఏ, సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌/ బీఈ, ఎంటెక్‌/ ఎంఈ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ. ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 21
దరఖాస్తు హార్డ్‌ కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 24
వెబ్‌సైట్‌:
http://careers.rgukt.ac.in/

అప్రెంటిస్‌షిప్‌
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

తిరుచిరాపల్లిలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌
మొత్తం ఖాళీలు: 191

విభాగాలు-ఖాళీలు: మెకానికల్‌-115, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌-17, ఈసీఈ-07, సీఎస్‌/ ఐటీ-20, సివిల్‌-29, కెమికల్‌-03.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్‌: నెలకు రూ.6000.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ టెక్నాలజీ ఉత్తీర్ణత.
వయసు: 28.10.2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 11
వెబ్‌సైట్‌:
https://www.bheltry.co.in/

వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే

జబల్‌పూర్‌ (మధ్యప్రదేశ్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 160
ట్రేడులు-ఖాళీలు: ఫిట్టరు-70, వెల్డరు-66, కోపా-03, పెయింటర్‌-11, మెషినిస్టు-10.
అర్హత: ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 05.11.2019 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 5
వెబ్‌సైట్‌:
https://wcr.indianrailways.gov.in/

వాక్‌-ఇన్స్‌
ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఆర్‌టీ

ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యుబర్‌క్యులాసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 46
పోస్టులు: సైంటిస్టు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, తదితరాలు.
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ, ఎంబీబీఎస్‌, ఎండీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
వాక్‌ఇన్‌తేది: అక్టోబరు 10
వేదిక: 1) నేషనల్‌ జల్మా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెప్రసీ అండ్‌ అదర్‌ మైక్రోబ్యాక్టీరియల్‌ డిసీజెస్‌, ఆగ్రా, యూపీ-282001.
2) నేషనల్‌ ఎయిడ్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎంఐడీసీ, భోసరీ, పుణె-411026.
వెబ్‌సైట్‌:
https://www.jalmanicmr.org.in/
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.