close

తాజా వార్తలు

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామా సమీపంలోని అవంతిపుర పట్టణ శివార్లలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. సైనికుల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ముష్కరులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడో ఇంకా తెలియరాలేదు.

కశ్మీర్‌లో దాదాపు 300మంది ఉగ్రవాదులున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ ప్రకటించారు. మరోవైపు సరిహద్దులో ముష్కరుల చొరబాట్లు విపరీతంగా పెరిగిపోయాయని.. పాక్‌ తిరిగి ఉగ్రశిబిరాలను ప్రారంభించినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాందర్బల్‌ అడవుల్లో భారీగా సైనిక బలగాల్ని హెలికాప్టర్ల ద్వారా దించుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా ఎన్‌కౌంటర్‌ ఉగ్రవాదుల కదలికపై నిఘా వర్గాల హెచ్చరికలకు బలం చేకూర్చుతోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.