close

తాజా వార్తలు

తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

పెద్దవడుగూరు: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని భీమునిపల్లెలో వైకాపా, తెదేపా వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన తెదేపా వర్గీయులు నాగేంద్ర ప్రసాద్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి వైకాపాకు చెందిన మౌలాలి మధ్య పాతకక్షలు ఉండేవి, ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు  దారి తీసింది. ఈ ఘర్షణలో తెదేపా వర్గీయులు నాగమ్మ, ఓబుల్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నాగేంద్ర ప్రసాద్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై శంకర్‌రెడ్డి గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.