close

తాజా వార్తలు

వాగులోకి ఒరిగిన బస్సు:తప్పిన పెనుప్రమాదం

కల్వకుర్తి గ్రామీణం: కల్వకుర్తి డిపోకు చెందిన టీఎస్‌ ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని రఘుపతిపేట సమీపంలోని దుందుభి వాగులోకి దూసుకెళ్లింది. తెల్కపల్లి నుంచి కల్వకుర్తికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాజ్‌వేను దాటుతున్న సమయంలో రహదారి సరిగా కనిపించకపోవడంతో బస్సు చక్రాలు ఇసుకలోకి కూరుకుపోవడంతో ఈ ఘటన జరిగింది. వాగులో నీటి ఉద్ధృతి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.