
తాజా వార్తలు
పరువునష్టం కేసు విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్ ఎదుట రాహుల్‌గాంధీ వివరణ
సూరత్: తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ కించపరచలేదని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వారందరి ఇంటిపేరు ఒక్కటే. దొంగలంతా ఒకే ఇంటి పేరు పెట్టుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ నేత తన వ్యాఖ్యల ద్వారా మోదీ వర్గమంతటిని అవమానించారంటూ సూరత్-పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్‌గాంధీ... గురువారం ఈ కేసు విచారణ నిమిత్తం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బి.హెచ్.కపాడియా ముందు హాజరయ్యారు. ‘మీపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా?’ అని ఆయన ప్రశ్నించగా... తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణల్లో నిజం లేదని రాహుల్ బదులిచ్చారు. తదుపరి విచారణ డిసెంబరు 10న జరుగనుంది. సూరత్‌లో తనకు బాసటగా నిలిచేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
