
తాజా వార్తలు
వరల్డ్ డిజైన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్: ప్రపంచ డిజైన్ రంగానికి హైదరాబాద్ కేంద్రం కాబోతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హస్త కళలు, టూరిజం, ఫ్యాషన్, యానిమేషన్ తదితర రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం వివిధ సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ ప్రగతిని ప్రపంచానికి చాటే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు.
‘ వినూత్న ప్రాజెక్టుల హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర డిజైనింగ్ నైపుణ్యాలను తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన అనేక అంశాలు.. డిజైనింగ్ ప్రాముఖ్యాన్ని చాటుతూ నగరంలో చిరకాలం నిలిచిపోయేలా రూపొందించాం. హైదరాబాద్ డిజైన్ వీక్‌లో సీఐఐ వంటి సంస్థలతో కలిసి యువత నుంచి వినూత్న ఆలోచనలు సేకరించాం. ప్రపంచ డిజైన్ రంగంతో హైదరాబాద్ కలిసేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుంది. డిజైన్ రంగంలో అవకాశాల కల్పన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. హైదరాబాద్‌ను గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్‌గా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నాం.’’ అని కేటీఆర్ అన్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
