close

తాజా వార్తలు

తొలిసారి కలిసిన నాలుగు గంటల్లోనే పెళ్లి

పశ్చిమ బెంగాల్‌: పెళ్లంటే... చూపులు. నిశ్చితార్థం. సంగీత్‌. మెహందీ. నలుగు. విందులు. తిరుగుళ్లు... ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవేవీ లేకపోయినా మనసులు ఒక్కటైతే చాలు, నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవచ్చని నిరూపించింది... హుగ్లీకి చెందిన ఓ జంట. ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థలో పనిచేస్తున్న సుదీప్‌ ఘోషల్‌, ప్రీతమాలు ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే దుర్గాష్టమి నాడు అమ్మవారి మండపంలో తొలిసారి కలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, దండలు మార్చేసుకున్నారు. సంబంధాలు చూసే బాధ లేకుండానే, అందమైన కోడలు తమ ఇంటికి వచ్చిందని సుదీప్‌ తల్లి తెగ సంబరపడిపోతోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.