close

తాజా వార్తలు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

పోలీసుల ఎదుట లొంగుబాటు


చంటిపిల్లలతో అమ్మమ్మ

తమ్మినాయునిపల్లె(చిత్తూరు)న్యూస్‌టుడే : అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతమైంది. భార్యను కిరాతకంగా చంపి శవాన్ని నీటికుంట బురదలో పాతిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని తమ్మినాయునిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన దేవేంద్రకు మదనపల్లె సమీపంలోని వడ్డిపల్లెకు చెందిన రెడ్డెమ్మ (28)తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె గంగాభవానీ (6), కుమారుడు సాహిత్‌ (1) ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న దేవేంద్ర మదనపల్లెలో కాపురం పెట్టాడు. గురువారం వడ్డిపల్లెకు వచ్చిన దేవేంద్ర .. మదనపల్లె బస్సు ఎక్కిస్తానని భార్య రెడ్డెమ్మకు చెప్పి కందూరు -నిమ్మనపల్లె మార్గంలో కాలిదారిలో తీసుకెళ్లాడు. ఆమెను అంతమొందించాలని అప్పటికే పథకం వేసుకున్న అతను మార్గంమధ్యలో రెడ్డెమ్మను బండరాయితో తలపైకొట్టి, గాజుసీసాతో పొడిచి గాయపరిచాడు. ఆమె ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేయగా సమీపంలోని అక్కగార్లనీటి గుంతలోని బురదలోకి తోసి గొంతునులిమి హతమార్చి ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్య తరచుగా ఇతరులతో చరవాణిలో మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి హత మార్చినట్లు అతను పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండుకు పంపుతున్నట్లు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. కన్నతల్లి కానరాక పిల్లలు తిండి కూడా తినడం లేదని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.