close

తాజా వార్తలు

చోరీ చేసి...శుభోదయం చెప్పి..!

శ్రీకాకుళం నగరంలోని సర్వేయరు ఇంట్లో ఆదివారం వెకువజామున చోరీ
32 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు, 3 తులాల వెండి అపహరణ


డాగ్‌స్వ్కాడ్‌ పరిశీలన

న్యూస్‌టుడే, అరసవల్లి : వారింట్లోనే చోరీకి పాల్పడి కుటుంబ పెద్దకు శుభోదయమని చెప్పి దర్జాగా వెళ్లిపోయిన సంఘటన శ్రీకాకుళం నగరంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం నగరంలోని కత్తెరవీధిలో నివాసముంటున్న వాండ్రంగి శ్రీనివాసరావు (ఈయన శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో లైసెన్స్‌డ్‌ సర్వేయరుగా పనిచేస్తున్నారు) తన  కుటుంబసభ్యులతో కలిసి గత శుక్రవారం ఒడిశా రాష్ట్రం పూరీ వెళ్లారు. వారింటిపైనే శ్రీనివాసరావు తల్లి దమయంతి ఉంటున్నారు. ఈమెను పూరీ తీసుకువెళ్లకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటి బయట ఉండడం దమయంతి గమనించారు. ఎవరు మీరు? శ్రీనివాసరావు పడుకోమన్నాడా అంటూ ఆమె ప్రశ్నించడంతో అవునంటూ గుర్తుతెలియని వ్యక్తి సమాధానమిచ్చి శుభోదయం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఉదయం 5 గంటల సమయంలో పాలు పోసేందుకు వచ్చిన మహిళ శ్రీనివాసరావు ఇంట్లో దీపాలు వెలుగుతుండడాన్ని గమనించింది. ఇంతలో దమయంతి మేడపై నుంచి కిందకు పాల కోసం దిగి చూడగా ఇంటికి వేసిన తాళాలు పగలుగొట్టి, గడియ విరగ్గొట్టి ఉండడంతో వెంటనే రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని బీరువాలో ఉంచిన 32 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు, 3 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పక్కపక్కనే ఇళ్లు ఉన్నా తలుపు గడియను విరగ్గొట్టారంటే చోరీల్లో ఆరితేరినవారే దొంగ తనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే దమయంతి తన కుమారుడు శ్రీనివాసరావుకు చరవాణి ద్వారా సమాచారమివ్వడంతో ఆయన కుటుంబసభ్యులతో కలిసి వెంటనే శ్రీకాకుళం చేరుకున్నారు. సంఘటనాస్థలంలో క్లూస్‌టీం వేలుముద్రలు సేకరించగా, డాగ్‌స్వ్కాడ్‌ పరిసరాలు పరిశీలించింది. పోలీసు శునకం కత్తెరవీధి నుంచి గొంటివీధి మీదుగా ఓ ప్రైవేటు ఆసుపత్రి వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో చుట్టుపక్కల ఎక్కడ నిఘా కెమెరాలున్నాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి, సీసీఎస్‌ డీఎస్పీ సత్యనారాయణ, రెండోపట్టణ సీఐ శంకరరావు పరిశీలించారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. క్లూస్‌టీం సేకరించిన వేలుముద్రల ఆధారంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

చోరీకి గురైన బంగారం, నగదు ఈ బీరువా లోనిదే

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.