close

తాజా వార్తలు

ప్రాజెక్టు మీది..ప్రోత్సాహం మాది!

స్టార్టప్‌ల స్థాపనకు విభిన్న సంస్థల తోడ్పాటు

రూ. 2 లక్షల నుంచి రూ. 3 కోట్ల పెట్టుబడి

అందరిలాగా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు.. అధినేతలుగా ఎదగాలనే తపన ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. కళాశాల దశలోనే అందుకు తగిన ఆలోచనలు చేస్తున్నారు. మిత్రబృందంతో కలిసి మథిస్తున్నారు. కానీ ముందుకు సాగాలంటే ఆర్థిక వనరులు అడ్డంకులుగా మారుతున్నాయి. అలాంటి ఇబ్బందులను తొలగించి తోడ్పాటును అందిస్తామంటున్నాయి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు. పెట్టుబడి పెట్టడంతోపాటు అవసరమైన సలహాలు, సూచనలతో దగ్గరుండి దారిచూపిస్తున్నాయి. స్టార్టప్‌లకు సాయం చేస్తూ ఔత్సాహికులను వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాయి.

క యువకుడు ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించి ఉన్నతస్థాయిలో ఉండాలనే తపన అతడిలో ఉంది. ఆశయాలకు అనుగుణంగా ఒక ప్రాజెక్టును సిద్ధం చేస్తాడు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో ఆలస్యం జరిగి ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారని అతడి పరిశోధనలో తేలుతుంది. వాటిని నివారించడానికి సాయపడే పరికరాన్ని తయారు చేస్తాడు. దాన్ని వాహనంలో అమర్చుకోవచ్ఛు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పరికరం వెంటనే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కీ, ఆసుపత్రికీ ఒకేసారి సమాచారాన్ని అందిస్తుంది. దాని తయారీ, పంపిణీకి అవసరమైన ఆర్థిక సాయం కోసం చాలామందిని సంప్రదిస్తాడు. ఇబ్బందులు పడతాడు. ఇటీవల విడుదలైన ఒక సినిమా ఇతివృత్తమిది. ఇలాంటివి నిజజీవితంలో ఇంకా ఎన్నో జరుగుతున్నాయి.ఆ సినిమా హీరోలాగా కష్టపడక్కర్లేదు అంటున్నాయి కొన్ని సంస్థలు. ఆర్థిక సాయంతోపాటు మెంటర్‌షిప్‌, టాలెంట్‌ యాక్సెస్‌, నెట్‌వర్కింగ్‌, మార్కెట్‌లోకి అడుగుపెట్టడం వంటి విషయాల్లో చక్కటి తోడ్పాటును అందిస్తున్నాయి.

చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకు తగినన్ని ఆర్థిక వనరులుంటేనే అది సాధ్యమవుతుంది. అంటే ఆలోచనతోపాటు అది ఆచరణలోకి రావడానికి ఆర్థిక తోడ్పాటూ అవసరం. ఇప్పుడు పలు సంస్థలు ఆ విధమైన అండను అందిస్తున్నాయి. వినూత్నమైన ఆలోచనలను సాకారం చేసుకొని, కొద్దికాలంలోనే భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు అలాంటి వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

ఆ రోజుల్లో...!

పారిశ్రామిక లేదా వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకునే యువకులు ఒకప్పుడు ఏదో ఒక సంస్థ/వ్యాపార నిర్వాహకుల వద్ద చేరి, కొంత అనుభవం సంపాదించేవారు. అవసరమైన డబ్బు సమకూర్చుకున్న తర్వాత సొంత సంస్థను మొదలుపెట్టేవారు. ఇందుకు కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ నేటి యువత స్థాపిస్తున్న స్టార్టప్‌లకు అంత సమయం అవసరం లేదు. గత ఏడాది నాస్కామ్‌ విడుదల చేసిన ‘ఇండియన్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ రిపోర్ట్‌’ ప్రకారం.. స్టార్టప్‌ వ్యవస్థలకు సంబంధించి ప్రపంచంలో మనదేశం మూడో స్థానంలో ఉంది. పెట్టుబడుల పరంగా 108% వృద్ధిని ప్రదర్శించింది. టెక్నాలజీ పరిణామం, స్వదేశీ మార్కెట్‌ అభివృద్ధి స్టార్టప్‌లకు అనువుగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌ అనుసంధానం పెరగడంతో కొత్త మార్కెట్లకు ఉత్పత్తులను వేగంగా చేరవేయడానికి వీలవుతోంది. దీంతో ప్రభుత్వం ‘స్టార్టప్‌ ఇండియా’ లాంటి ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది. టాక్స్‌ బెనిఫిట్స్‌, ఫండింగ్‌, మార్కెటింగ్‌ వంటి ఎన్నో అంశాల్లో ఇవి సాయం చేస్తాయి.

సాంకేతిక ఆలోచనలకు..!

భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ దీన్ని అందిస్తోంది. అభ్యర్థుల ఆలోచన/ రూపకల్పనలకు ప్రచారం, పెట్టుబడి అందిస్తారు. తద్వారా విజయం సాధించేందుకు సాయపడతారు. కాన్సెప్చువలైజేషన్‌, ఫాబ్రికేషన్‌, డెవలప్‌మెంట్‌, ట్రయల్‌ వంటి వివిధ దశల్లో గ్రాంట్లను అందజేస్తారు. రూ.2 లక్షల నుంచి రూ. కోటి వరకు తోడ్పాటు ఉంటుంది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌, నవీన రూపకల్పనలపై ఆసక్తి ఉన్నవారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్ఛు సమాజానికీ, వినియోదారులకూ ఈ రూపకల్పన ద్వారా లభించే లాభాల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://www.step-iit.org/tepp.html

ప్రిజమ్స్‌ (ప్రమోటింగ్‌ ఇన్నవేషన్స్‌ ఇన్‌ ఇండివిడ్యువల్స్‌ స్టార్టప్స్‌ అండ్‌ ఎంఎస్‌ఎంఈ)

ప్రోగ్రాం పేరు: టెక్నోప్రెన్యూర్‌ ప్రమోషన్‌ ప్రోగ్రామ్‌ (TePP), వేటికి సాయం: టెక్నాలజీ ఆధారిత రూపకల్పనలకు.

టెక్‌ స్టార్టప్‌లకు..

ఎంపిక చేసిన స్టార్టప్‌లకు పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ తోడ్పాటు మొదలైనవి అందే విధంగా చూస్తారు. నాస్కామ్‌ నెట్‌వర్క్‌తో పార్ట్‌నర్‌షిప్‌ అవకాశాలూ ఉంటాయి. పెట్టుబడితోపాటు మెంటర్‌షిప్‌ ఉంటుంది. అన్నిదశల్లోనూ తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. టెక్‌ స్టార్టప్‌లకు సంబంధించి ఇంక్యుబేట్‌, వర్చువల్‌ ఇంక్యుబేట్‌ ప్రోగ్రామ్‌లనూ నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్ఛు.

http://10000startups.com/

ఐటీ నుంచి ఐఓటీ వరకు

మల్టిప్లయర్‌ గ్రాంట్స్‌ స్కీంను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అందిస్తోంది. ఐటీ, అనలిటిక్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌, ఐఓటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, టెక్నాలజీ హార్డ్‌వేర్‌ మొదలైన పరిశ్రమలవారికి సాయం అందిస్తారు. నవీన రూపకల్పనలో పరిశ్రమలకు, అకడమిక్స్‌/ ఆర్‌ అండ్‌ డీ సంస్థల మధ్య అనుసంధానం కల్పించడం దీని ఉద్దేశం. రూ.రెండు కోట్ల వరకు గ్రాంటు అవకాశం ఉంటుంది. ఇంక్యుబేటర్‌/ అకడమియా/ ఆక్సిలరేటర్‌లు అప్లై చేసుకోవచ్ఛు దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో చేయాలి. వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ ఉంటుంది.

https://meity.gov.in/content/multiplier-grants-scheme

మల్టిప్లయర్‌ గ్రాంట్స్‌ స్కీం (ఎంజీఎస్‌)

వేటికి సాయం: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించి.

నాస్కామ్‌

ప్రోగ్రామ్‌: 10,000 స్టార్టప్స్‌

వేటికి సాయం: హెల్త్‌కేర్‌, అగ్రికల్చర్‌, ఎడ్యుకేషన్‌, స్మార్ట్‌ సిటీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐలకు.

కొత్త ఉత్పత్తులు, సేవలకు..

డీఎస్‌టీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల సాయంతో అమిటీ యూనివర్సిటీ దీన్ని నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, సాంకేతిక నిపుణులు, మేనేజర్లతో కూడిన బృందం వీరికి అందుబాటులో ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బిజినెస్‌ అడ్వైజరీ, మెంటరింగ్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అంశాల్లో అవగాహన కల్పిస్తారు. అయిదేళ్లలోపు అనుభవమున్న స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోవచ్ఛు కొత్త ప్రొడక్ట్స్‌, సర్వీసులకు ఆదరణ ఉంటుంది. విద్యార్థులకు స్టూడెంట్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://www.amity.edu/aii/index.aspx

అమిటీ ఇన్నవేషన్‌ ఇంక్యుబేటర్‌

వేటికి సాయం: టెక్నాలజీ, ఇన్నవేషన్‌కు సంబంధించి.

సాంఘిక, ఆర్థిక పరిష్కారాలకు సాయం

సోషల్‌ ఆంత్రప్రెన్యూర్లకు పెట్టుబడి, సలహాలు, సూచనలు అందిస్తారు. దీర్ఘకాలిక సాంఘిక- ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను చూపించే వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వీరి ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. వ్యక్తిగత శిక్షణ ఇస్తారు. తగిన ఆలోచన ఉన్నవారు, అయిదేళ్లలోపు మొదలైన స్టార్టప్‌లు దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు http://unltdindia.org/

అన్‌లిమిటెడ్‌ ఇండియా

వేటికి సాయం: అగ్రికల్చర్‌, లైవ్లీహుడ్స్‌, ఎడ్యుకేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌, స్పోర్ట్స్‌, జెండర్‌ ఈక్వాలిటీ, హెల్త్‌, ఎనర్జీ, వాటర్‌ అండ్‌ శానిటేషన్‌, ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌, హౌసింగ్‌ మొదలైన వాటికి సంబంధించి.

అన్ని రకాల ఆలోచనలకు..

ప్రభుత్వ అండ ఉన్న సంస్థ ఇది. ఇందులో వివిధ రకాల ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్ఛు ఆలోచన నుంచి అభివృద్ధి దశలో ఉన్న అన్నింటికీ సాయం అందిస్తారు. పెట్టుబడి, మెంటర్‌, ఆలోచన అభివృద్ధి వంటివి ఉంటాయి. రూ. కోటి వరకూ ఫండింగ్‌ పొందే వీలుంది. https://www.amritatbi.com/

అమృత టీబీఐ

వేటికి సాయం: ప్రత్యేకంగా ఒకదానికంటూ ఏమీ లేదు. అన్ని రకాల ఆలోచనలకు.

విదేశీ మార్కెట్లలోకి వెళ్లే వీలు

ఒక సంస్థను స్థాపించడానికి అవసరమైన అన్ని వనరులనూ, సేవలనూ ఈ సంస్థ అందిస్తుంది. ఫండింగ్‌, మెంటర్‌షిప్‌, టాలెంట్‌ యాక్సెస్‌, నెట్‌వర్కింగ్‌, విదేశీ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకూ ఫండింగ్‌ ఉంటుంది.వెబ్‌సైట్‌: https://india.zonestartups.com/

జోన్‌ స్టార్టప్స్‌

వేటికి సాయం: టెక్నాలజీకి సంబంధించి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.