close

తాజా వార్తలు

మోదీ గారు మహిళల రక్షణ పై దృష్టి పెట్టండి

నాగాలాండ్‌: ‘మోదీజీ ఆవుల కంటే ముందు మహిళల రక్షణపై దృష్టి పెట్టండి’ అని ఒక అందాల పోటీలో అభ్యర్థి చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాగాలాండ్‌లో ‘మిస్‌ కోహిమా 2019’ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా న్యాయమూర్తులు వికునావో సచు అనే 18 ఏళ్ల యువతిని ‘మీరు ప్రధాన మంత్రికి మీరిచ్చే సలహా ఏమిటీ?’ అని న్యాయనిర్ణేతలు ప్రశ్నించారు. దానికి ఆ యువతి ‘ముందు మీరు మహిళలపై దృష్టి పెట్టండి తరువాత ఆవుల గురించి పట్టించుకోండి ’ అని ఆమె సమాధానం చెప్పారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని సోషల్‌ మీడియాలో ఉంచిన కొద్ది సమయంలోనే దాదాపు 60 వేల మందికి పైగా వీక్షించారు. కొన్ని వేల లైక్‌లు వచ్చాయి. ఈ పోటీలో సచు మూడో స్థానంలో నిలిచారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.