close

తాజా వార్తలు

‘బిగిల్‌’కు తొలగిన అడ్డంకులు

విజయ్‌

టీనగర్‌, న్యూస్‌టుడే: విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘బిగిల్‌’ చిత్రం అడ్డంకులను దాటింది. దీపావళికి సినిమా విడుదల కావడం ఖాయమైంది. సెన్సార్‌ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం అందిన నేపథ్యంలో చిత్ర బృందం విడుదల పనులను వేగవంతం చేసింది. చిత్రానికి ‘యూ/ఏ’ ధ్రువపత్రం అందడంతో విజయ్‌ అభిమానులు రెట్టింపు ఉత్సాహంలో వుున్నారు. ఈ పత్రం అందని కారణంగా ఇంతకాలం జాప్యం అయిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా చిత్రబృందం కృషి చేసి ఎట్టకేలకు ఈ పత్రాన్ని అందుకుంది. ఈ విషయాన్ని విలేకర్లకు తెలియజేసింది. దీపావళి పండుగ నాటికి చిత్రాన్ని విడుదల చేయడం ఖాయమేనంటూ తేల్చి చెప్పింది. ఈ సంవత్సరం దీపావళి పండుగను విజయ్‌ చిత్రంతో ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.