close

తాజా వార్తలు

చదువు బీటెక్‌.. మోసాలు హైటెక్‌!

ఎంఎన్‌సీల్లో ఉద్యోగాల పేరిట టోకరా
ఉద్యోగ వేటలో ఉన్న సాటి నిరుద్యోగులే లక్ష్యం
ఇద్దరు యువకులు, ఓ యువతి అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: బహుళ జాతి సంస్థల్లో (ఎంఎన్‌సీల్లో) ఉద్యోగాలిప్పిస్తామంటూ తోటి నిరుద్యోగులను నమ్మించి పలువురి నుంచి రూ. లక్షల్లో దండుకుని తప్పించుకున్న తిరుగుతున్న ఒక యువతి, ఇద్దరు యువకులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై సైదులు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన నీరుమల్ల మౌనిక ఇటీవల బీటెక్‌ పూర్తి చేసింది. అమీర్‌పేట్‌లోని ఎగ్జిక్యూటివ్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలో మామిడి వరలక్ష్మి అనే స్నేహితురాలితో కలిసి ఈ నెల 12న హిమాయత్‌నగర్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రైల్‌పేట్‌కు చెందిన సురగాని హేమంత్‌ (23), గుంటూరు నగరం నల్ల చెరువు లేన్‌-5కు చెందిన నలిబండ్ల అరుణశ్రీ (23), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం, పెనుమంచిడి గ్రామానికి చెందిన బాలమురళీ బాలమ్‌ (25)లను కలిశారు. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఇంటి వద్దే ఉంటూ పనిచేసే ఉద్యోగం ఉందని, ఏడాదికి రూ. 12 నుంచి రూ.20 లక్షల వరకు సంపాదించవచ్చని ఆ ముగ్గురు నమ్మించారు. ఆ ఉద్యోగం కావాలంటే రూ. 2.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. వారు చెప్పిన మాటలను నమ్మిన మౌనిక మరుసటి రోజు (13న) రూ. లక్షను లక్ష్మీసుప్రియా పల్లపోతుకు చెందిన ఫోన్‌పే నెంబరు 77026 37634కు బదిలీ చేసింది. 14న మరో రూ. లక్ష హేమంత్‌కు (నెంబరు 83282 09634)కు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. మిగతా రూ. 30 వేలూ వెంటనే చెల్లించాలని, లేకపోతే ఉద్యోగం రాదని హేమంత్‌ భయపెట్టడంతో 14న రాత్రి మౌనిక తన ఏటీఎం కార్డు ఇవ్వడంతో వెంటనే అతను హిమాయత్‌నగర్‌ వై.జంక్షన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ.30 వేలు తీసేసుకున్నాడు. ఉద్యోగం ఏమైందని అడిగితే రేపూ మాపంటూ తిప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టాడు. మోసగించారని అర్థం చేసుకున్న మౌనిక నారాయణగూడ పోలీసులను ఆశ్రయించింది.
హిమాయత్‌నగర్‌లో హేమంత్‌, హేమంత్‌, అరుణశ్రీ, బాలమురళిలను గురువారం అదుపులో తీసుకున్నట్లు నారాయణగూడ ఎస్సై సైదులు పేర్కొన్నారు. నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వరలక్ష్మి నుంచి నిందితులు రూ. 1.2 లక్షలు, చక్కా పావని నుంచి రూ. 1.75 లక్షలు, పారా గీతాంజలి నుంచి రూ.1.50 లక్షలు, షేక్‌ సాఫియా నుంచి రూ.1.70 లక్షలు.. ఇలా  రూ. లక్షల్లో దండుకున్నారని విచారణలో వెల్లడైంది. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువ మంది యువతులే కావడం గమనార్హం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.