close

తాజా వార్తలు

భర్తను హతమార్చడానికి కుట్రపన్నిన భార్య

ప్రియుడితో కలిసి కిరాయి హత్యకు పథకం
ఛేదించిన పోలీసులు
భార్యతోసహా ముగ్గురి అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కిరాయి హంతకులతో హతమార్చడానికి భార్య, ప్రియుడు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్య చేయడానికి మారణాయుధాలతో మాటువేసిన నిందితులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి బాధిత భర్త ప్రాణాలు కాపాడారు. భార్యతోపాటు ముగ్గురు నిందితులను నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ వెంకటరెడ్డి ఈ వివరాలను విలేకర్లకు వెల్లడించారు.

నగరంపాలెంకు చెందిన షేక్‌ మౌలాలీకి పదేళ్ల కిందట షేక్‌ మస్తానీతో వివాహమైంది. చరవాణి రిపేరు చేసే ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ గౌస్‌బాషా.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈవిషయం తెలిసిన భర్త మౌలాలీ ఆమెను మందలించి పద్ధతి మార్చుకోవాలని ఘాటుగా హెచ్చరించాడు. అప్పటి నుంచి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు గౌస్‌బాషాతో కలసి మస్తానీ కుట్రపన్నింది. సుఫారీ తీసుకొని హతమార్చే కిరాయి హంతకులతో ఇద్దరూ కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఈక్రమంలో గౌస్‌బాషా తన స్నేహితులైన రౌడీషీటర్లు ఏటీ అగ్రహారానికి చెందిన షేక్‌ షఫీ, ఐపీడీ కాలనీకి చెందిన దగ్గుబాటి బాలకోటేశ్వరరావులతో రూ.2 లక్షలకు మాట్లాడుకున్నారు. అవసరమైతే మరో రూ.లక్ష అదనంగా ఇస్తామని చెప్పారు. ముందస్తుగా రూ.30 వేలు సుఫారీ తీసుకున్న షఫీ, బాలకోటేశ్వరరావులు మౌలాలీని హత్య చేయడానికి గత రెండు నెలలుగా రెక్కీ నిర్వహిస్తున్నారు.

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు: ఈనెల 20వ తేదీన సీఐ వెంకటరెడ్డి, ఎస్సైలు గీతాంజలి, కిరణ్‌, భాగ్యరాజు, సిబ్బంది భూపతి, మణి, సురేష్‌, కిషోర్‌లతో ఏటీ అగ్రహారంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా గౌస్‌బాషా, షేక్‌ షఫీ, బాలకోటేశ్వరరావులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. పోలీసులు తమదైనశైలిలో విచారించగా తాము మౌలాలీని హతమార్చడానికి మాటువేసి ఉన్నామని తెలిపారు. ఆమెతోపాటు ప్రియుడు గౌస్‌బాషాలు కలసి హత్యకు రూ.2 లక్షలకు కిరాయి ఒప్పందం చేసుకున్నారని నిందితులు ఒప్పుకున్నారని సీఐ చెప్పారు. వీళ్లు హత్యలు, గంజాయి విక్రయాలు చేస్తుంటారని తెలుసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మారణాయుధాలు, 1250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షేక్‌ షఫీ నల్లపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో మూడు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని గుర్తించామన్నారు. గుంటూరులో రౌడీ కార్యకలాపాలు చేస్తే ఎవరిని ఉపేక్షించమన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.