
తాజా వార్తలు
ఘనమైన వారసత్వం తిరిగొచ్చింది
ధర: రూ.1.69 లక్షలు
ఇటలీలో పుట్టి ప్రపంచమంతా ఘనమైన పేరు తెచ్చుకున్న ద్విచక్రవాహన కంపెనీ బెనెల్లీ. నాణ్యతలో, పనితీరులో మెరుగైనవని ఈ కంపెనీ బైక్‌లకు పేరు. భారత మార్కెట్లో వాటా దక్కించుకోవడానికి హైదరాబాద్‌లోనే ఓ తయారీ యూనిట్‌ని తెరిచింది బెనెల్లీ. ఇక్కడే రూపుదిద్దుకున్న ఇంపీరియల్ 400 తొలిసారి రోడ్డెక్కబోతోంది.
* 2017 మిలన్ వాహన ప్రదర్శనలో తొలిసారి నమూనా మోడల్ ప్రదర్శించారు. దృఢమైన బాడీ, ఆకట్టుకునే డిజైన్‌తో రెట్రో స్టైల్ క్రూజర్ విభాగంలో వచ్చింది.
* కంపెనీ ప్రారంభించిన తొలినాళ్లలో మోటో-బీ మోడల్ బాగా సక్సెస్ అయింది. ఆ ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ అదే స్ఫూర్తితో ఈ మోడల్ని రూపొందించారు.
* 373.5సీసీ సింగిల్ సిలిండర్, 5,500ఆర్పీఎం మీద అత్యధిక సామర్థ్యం 20బీహెచ్పీ.
* ఇది పూర్తిగా రెట్రో స్టైల్‌తో వచ్చింది. స్పోక్ వీల్ రిమ్‌లు, ఎగ్జాస్ట్, అద్దాలు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇండికేటర్, టెయిల్ ల్యాంప్.. ఇవన్నీ పాతరోజుల్లోకి తీసుకెళ్తాయి.
* నలుపు, ఎరుపు, వెండి రంగుల్లో లభ్యమయ్యే ఇంపీరియల్ 400 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, జావా స్టాండర్డ్లతో ఢీకొట్టబోతోంది.
* డబుల్ క్రాడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, డబుల్ షాక్అబ్జార్బర్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ, అల్యూమినియం అలాయ్ రిమ్‌లు, ముందు 19 అంగుళాలు, వెనక 18 అంగుళాల చక్రాలు కొన్ని ఫీచర్లు.