close

తాజా వార్తలు

జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు

శ్రీనగర్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జవాన్లతో దీపావళి పండగ జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద బీజీ బ్రిగేడ్‌ ప్రధాన కార్యాలయం వద్ద జవాన్లను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు జవాన్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాకతో తమకు ఈ దీపావళి ఎంతో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. ఆయనను కలిసినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల గురించి ఆయన మాట్లాడారని తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు తమ నిరంతర సేవలను కొనసాగించాలని ప్రధాని వారిని కోరినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మోదీ జమ్మూ వెళ్లడం ఇదే తొలిసారి.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.