close

తాజా వార్తలు

మీరైతే ఏంచేస్తారు

ఈతరం మహిళలకు సామాజిక చొరవ పెరిగింది. స్నేహితులతో కలిసి బృందాలుగా ఏర్పడుతున్నారు. వాటికో చక్కని పేరు పెట్టుకోవడమే కాదు... వాటి ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంటున్నారు. సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాంటి బృందాల గురించి తెలుసుకుందామా...

మేం విశాఖపట్టణంలోని పోర్టు హాస్పిటల్‌ నర్సులుగా పనిచేస్తున్నాం. మేం దాదాపు 50మంది ‘జీజేహెచ్‌ నర్సుల సేవాహస్తం’ పేరుతో ఒక్కటయ్యాం. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ, ఉచితంగా మందులు అందిస్తున్నాం. డ్యూటీలు లేని ఖాళీ సమయాల్లో, సెలవుల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తూ మా వంతుగా సమాజసేవ చేస్తున్నాం.

- వై.లలిత కుమారి

మా అపార్ట్‌మెంట్‌లో మహిళలందరం కలిసి నెలకు ఒకరోజు ‘హ్యాపీ విమెన్స్‌’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తాం. సానుకూల వైకరి అలవరచుకోవడం, మానసిక దృఢత్వం పెంచుకోవడం, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై చర్చలు పెడతాం. అనంతరం ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతాం. రోజువారీ పనులకు దూరంగా నూతన ఉత్తేజం నింపేలా మా కార్యక్రమాలు ఉంటాయి.

- తేజ వంగా

విశాఖ జిల్లా యలమంచిలిలో విశ్రాంత ఉద్యోగినులం, వివిధ వయసుల వారందరం కలిసి ‘నవక్రాంతి మహిళా మండలి’ పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డాం. పాఠశాల విద్యార్థులకు విద్యాసామగ్రి, అనాథ ఆశ్రమాలకు అవసరమయ్యే సరకులు, దివ్యాంగ పిల్లలు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నాం. వ్యాధులపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. సంఘం తరఫున నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలు మాకు ఉత్సాహాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయి.

- అరుణకుమారి

మేం పదిమంది మహిళలం కలిసి విజయనగరంలో డ్వాక్రా సంఘంగా ఏర్పడ్డాం. మా ప్రాంతంలో పారిశుద్ధ్యం, బోరు పంపులు, తాగునీటి సమస్య, వీధికుక్కలు తదితర సమస్యలకు సంఘం తరఫున పరిష్కారాలు చూపించాం. ఇందుకోసం గ్రీవియన్స్‌ సెల్‌, వార్డ్‌ కౌన్సిలర్‌, అధికారులను సంఘం తరఫున సంప్రదించాం.

- సరళాజగన్నాథ్‌

మేం కొంతమంది మహిళలం కలిసి కూకట్‌పల్లిలో ‘క్యాన్సర్‌ వైవల్‌’ పేరుతో వాట్సాప్‌ గ్రూపు పెట్టుకున్నాం. మా బృందంలోని సభ్యులంతా బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌లోని రోగులకు ఆర్థికంగా, మానసికంగా అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. డబ్బు సేకరించి వాళ్ల వైద్యానికి అందిస్తాం. ఎలాంటి మందులు తీసుకోవాలో వివరిస్తాం. ఖాళీసమయం దొరికినప్పుడల్లా బాధితులతో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తాం. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి అవసరమయ్యే మానసిక స్థైర్యం అందిస్తున్నాం.

- కల్యాణి పసుపులేటి

నాతో పాటు విశాఖపట్టణం ఎంసీహెచ్‌ స్కూల్‌ నుంచి 1998లో పదోతరగతి చదివిన మిత్రులందరం కలిసి ‘మున్సిపల్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒక అంధ పాఠశాలకు ఆర్థికసాయం అందించాం. బృంద సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసి కొంతమంది రోగులకు వైద్య చికిత్సలకు అవసరమైన సాయం చేశాం. మేమంతా పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

- ఎండీ జైబున్నిషా

ఎదుగుతున్న పిల్లలకు ఆటపాటలతో పాటు సామాజిక చైతన్యం పెరగాలంటే స్నేహితులూ ముఖ్యమే. మీ పిల్లల్లో స్నేహభావాన్ని పెంపొందించడానికి, వారు ఎక్కువ మందితో స్నేహం చేయడానికి తల్లిగా మీరేంచేస్తారు? మీ అనుభవాలను ఈ కింది నంబరుకు వాట్సాప్‌ చేయండి.

వసుంధర డెస్క్‌ ఫోన్‌: 9154091911


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.