
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి నెల రోజులు కావొస్తున్నా ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తోందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. కేంద్రం రూపొందించిన చట్టాల పట్ల సీఎం కేసీఆర్ ఒకే మాదిరిగా కాకుండా చట్టానికొక విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉన్నదే తప్ప ప్రైవేటుపరం చేయాలని ఎక్కడా లేదన్నారు. ఆర్టీసీ యూనియన్లు రాజకీయ పార్టీల మాయలో పడలేదని.. సంస్థను కాపాడుకోవడానికి వారి హక్కుల కోసం సంఘటితంగా సమ్మెకు దిగారని రావుల పేర్కొన్నారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్కౌంటర్ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
