
తాజా వార్తలు
వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
ముంబయి: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సోషల్‌మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె నాలుగేళ్ల చిన్నారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టడమే దీనికి కారణం. స్వరా తాజాగా ‘సన్ ఆఫ్ అభిష్’ అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన ఓ వీడియో బయటికి వచ్చింది. ఇందులో స్వరా కెరీర్ ఆరంభంలో ఓ ప్రకటనలో నటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ యాడ్ షూట్లో ఓ బాలనటుడు తనను ‘ఆంటీ’ అన్నాడంటూ.. ఏ మాత్రం ఆలోచించకుండా అతడ్ని బూతులు తిట్టారు. ఆ షూట్ తనను నిరాశకు గురి చేసిందని, బాలుడు తనను ఆంటీ అనడం ఏంటని బాధపడ్డారు. అంతేకాదు పిల్లలు దయ్యాలతో సమానమని చెప్పారు. ఆమె చేసిన కామెంట్లు షోలోని ఆడియన్స్‌ను నవ్వించాయి. కానీ ట్విటర్లో మాత్రం ఆగ్రహానికి గురి చేశాయి. మంచి-చెడు తెలియని నాలుగేళ్ల బాలుడిని ఆమె తిట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెమెరా ముందు ఇలాంటి దారుణమైన పదాలు వాడటం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆమె పిల్లల్ని వేధించకూడదంటూ గత ఏడాది ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని కొందరు కామెంట్లు చేశారు.
అంతేకాదు స్వరాపై ఓ స్వచ్ఛంద సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు ఫిర్యాదు చేసింది. నటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
