close

తాజా వార్తలు

తహసీల్దార్‌ హత్యకేసు నిందితుడు సురేశ్‌ మృతి

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్‌ మృతిచెందాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో విజయారెడ్డిపై ఘాతుకానికి ఒడిగట్టిన క్రమంలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను తొలుత అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్‌ మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌.. ఈ నెల 4న మధ్యాహ్నం కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సురేశ్‌కూ నిప్పంటుకుంది. సుమారు 60 శాతం కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని తొలుత హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రగాయాలతో ఉన్న సురేశ్‌ ఆరోగ్యం తొలి నుంచీ విషమంగానే ఉంది. ఈ క్రమంలో అతడు ఈరోజు మధ్యాహ్నం మృతిచెందాడు. భూవివాదం నేపథ్యంలో సంచలనం సృష్టించిన ఈ సజీవ దహనం కేసులో ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తహసీల్దార్‌ విజయారెడ్డి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ గురునాథం కూడా తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. తాజాగా సురేశ్‌ మృతితో ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. తీవ్ర గాయాలపాలైన తహసీల్దార్‌ అటెండర్‌ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.