close

తాజా వార్తలు

రవితేజ సినిమా కోసం తమిళ స్టార్‌

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటిస్తున్నారు.  ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. టీంలోకి ఆమెకు స్వాగతం పలికింది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు. ‘బలుపు’, ‘డాన్‌ శ్రీను’ తర్వాత రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వరలక్ష్మి పలు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి సినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ఈ నెల 15న చిత్రం విడుదల కాబోతోంది. దీని తర్వాత వరలక్ష్మి తెలుగులో రవితేజ ప్రాజెక్టుకు సంతకం చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.