close

తాజా వార్తలు

లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న డోర్లు.. యువకుడి మృతి

గవర్నర్‌పేట: విజయవాడలోని గవర్నర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఓ అపార్టుమెంట్‌లో లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బందరు రోడ్డులోని ఓ అపార్టుమెంటులో షేక్‌ ఇర్ఫాన్‌ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం కిందికి దిగేందుకు లిఫ్ట్‌ దగ్గరికి వచ్చి బటన్‌ నొక్కాడు. వెంటనే ద్వారం తెరచుకుంది. అయితే అప్పటికి లిఫ్ట్‌ ఆ ఫ్లోర్‌కు రాలేదు. ఆ విషయాన్ని గమనించని ఇర్ఫాన్‌.. లోపలకి అడుగు వేశాడు. దీంతో లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్తు నుండి కిందపడి అక్కడికక్కటే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గవర్నర్‌పేట పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.