
తాజా వార్తలు
హైదరాబాద్: కెమెరా ఎదుట ముద్దు సన్నివేశాల్లో నటించే ప్రసక్తేలేదని, కెరీర్ ఆరంభం నుంచి ఇలానే ఉన్నానని కథానాయిక తమన్నా అన్నారు. ఈ భామ తమిళ స్టార్ విశాల్‌తో కలిసి నటించిన సినిమా ‘యాక్షన్’. నవంబరు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సి.సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం మిల్కీబ్యూటీ గ్రీన్ బాడీసూట్ ధరించారు. అయితే దీన్ని ధరించేందుకు ఇబ్బందిపడ్డానని, కాస్త సందేహించానని ఆమె ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నటిగా కెరీర్ ఆరంభం నుంచే కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు వెల్లడించారు.
‘నిజాయితీగా చెబుతున్నా.. బాడీ సూట్ వేసుకునేంత సరైన శరీరం నాకు లేదని తొలుత అనిపించింది. ఇలాంటివి ధరించేందుకు సరైన ఆకృతి అవసరం, అందుకే కాస్త ఆలోచించా. కేవలం ఆ ఒక్క సూట్ ధరించేందుకు డైట్ పాటించి, బరువు తగ్గాను. సాధారణ శరీరాకృతిలో ఇలాంటివి ధరిస్తే చూసేందుకు సరిగ్గా ఉండనేమో అనిపించింది. కెరీర్ ఆరంభం నుంచి నటిగా నాకంటూ కొన్ని హద్దులు ఉంచుకున్నా. ‘నా కాంట్రాక్ట్‌లోని నియమాల్ని నేను ఇప్పటికీ అలానే ఉంచాను. కెరీర్ ఆరంభం నుంచి వాటిని ఫాలో అవుతున్నాను. స్క్రీన్‌పై నిజంగా ముద్దు పెట్టుకోకూడదని అనుకున్నా.. అలానే ఉన్నా. ఈ విషయాల్లో రాజీపడను, ఎటువంటి మార్పులు చేయను’ అని ఆమె పేర్కొన్నారు.
తమన్నా పలు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించారు, కానీ నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరా ట్రిక్కుల ద్వారా వాటిని రూపొందించారు. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘బోలే చుడియన్’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో ఆమె మెరవనున్నారు. ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘క్వీన్’ రీమేక్ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ విడుదల కావాల్సి ఉంది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
