
తాజా వార్తలు
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: తన తల్లిదండ్రులకు పని కల్పించిన ఇంట్లోనే ఓ బాలుడు చోరీకి పాల్పడ్డాడు. పోలీసు విచారణలో పట్టుబడి కటకటాల్లోకి వెళ్లాడు. రాజేంద్రనగర్ డీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలోని బండ్లగూడ శారదానగర్‌లో నివాసం ఉండే గోవర్థన్‌రెడ్డి స్టీల్, సిమెంట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఎప్పటిలాగే రూ.25లక్షలు ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు. ఆ ఇంట్లో కాపలాదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కింది అంతస్తులో నివాసం ఉంటున్నాడు. కాపలాదారు భార్య గోవర్థన్‌రెడ్డి ఇంట్లో పనిమనిషి. అయితే వారి కుమారుడు(16) అప్పుడప్పుడు తల్లి వెంట యజమాని ఇంట్లోకి వెళ్లేవాడు. ఇలా వారి ఇంట్లో వస్తువులు, నగదు ఎక్కడ పెడతారనే విషయం పూర్తిగా అతనికి తెలుసుకున్నాడు. ఈ నేపథ]్యంలో వారంరోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న నగదు తీసుకొని బయటకు వచ్చాడు. నగదు తీసుకొని స్థానికంగా ఉండే అతని బాబాయ్ దగ్గరకు వెళ్లి ఇచ్చాడు. ఈ నెల 8న బీరువా తెరిచేందుకు యజమాని ప్రయత్నించగా తాళంచెవి కనిపించలేదు. అనుమానంతో బీరువాను పగలగొట్టి చూడగా అందులో నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అదేరోజు రాజేంద్రనగర్ ఠాణాలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనుమానంతో కాపాలదారు కుమారుడిని విచారించగా నగదు దొంగలించినట్లు తేలింది. అతని వద్ద నుంచి రూ.24.70 లక్షలు స్వాధీనం చేసుకొని నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
