
తాజా వార్తలు
ఒంగోలు: ‘నేటి బాలలే రేపు మన సమాజ నిర్మాతలు’ అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 33 శాతం మంది పిల్లలు చదువురాని వారున్నారని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘ మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఎక్కడ చూసినా అంతర్జాలమే కనిపిస్తోందని, మరో 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోనుందని చెప్పారు.
పదేళ్ల తర్వాత ప్రతి రంగంలోనూ రోబోటిక్స్ కీలకం కానున్నాయని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు. పేదల తలరాత మార్చాల్సిన అవసరం మనకు లేదా? అని సీఎం అన్నారు. కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయడం సమంజసమా? అని ప్రతిపక్షాలను విమర్శించారు. ‘ ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలను మార్చాలి. పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా? మన పిల్లలకు ఆంగ్ల చదవులు రాకపోతే వాళ్ల పరిస్థితేంటి?మన పిల్లలు నైపుణ్యం లేని పనివారిగానే మిగిలిపోవాలా’ అని జగన్ అన్నారు.
ఒక్కోతరగతి పెంచుకుంటూ వెళ్తాం
విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే విమర్శలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘ ఒక మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. చరిత్రను మార్చే తొలి అడుగు ‘నాడు-నేడు’ ప్రారంభించాం. 45 వేలకు పైగా పాఠశాలల్లో మూడు దశల్లో దీనిని అమలు చేస్తాం. మొదటి దశ కింద 15,715 పాఠశాలల్లో అమలు చేస్తాం. తరగతి గదుల్లోని అన్ని మౌలిక సదుపాయాలతో ఉంటాయి. అదనపు తరగతి గదులు, ఆంగ్ల ప్రయోగ శాలల వంటి 9 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి పాఠశాలలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు కూడా ఉంటుంది.1 నుంచి 6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తాం. ఆ తర్వాత ఒక్కో తరగతి పెంచుకుంటూ వెళ్తాం’ అని సీఎం వివరించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని, వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తేనే తలరాత మారుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎంతమంది నన్ను విమర్శించినా ముందడుగే వేస్తామని జగన్ స్పష్టం చేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
