
తాజా వార్తలు
ఆదిలాబాద్ నేర విభాగం: కుటుంబంలో కలహాలు రావడంతో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అక్క, బావకు సూచించాడు ఓ వ్యక్తి. బావమరిది తనకు నీతులు చెప్పడం ఏంటని భావించిన బావ ఏడాది క్రితం జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని అదును చూసి బావమరిది గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన అదిలాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒసావార్ సంతోష్, మమత దంపతులు ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 14 ఏళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో ఏడాది క్రితం మమత మహారాష్ట్రలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయిన కొంత కాలం తర్వాత తాను మారిపోయానని.. ఇకపై ఎలాంటి గొడవలు పెట్టుకోనని భార్యను నమ్మించి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు సంతోష్. అయితే ఏడాది క్రితం జరగిన గొడవలో తన బావమరిది తగడపల్లి మనోజ్ తనకు నచ్చజెప్పడం సంతోష్‌కు నచ్చలేదు.
ఈ క్రమంలో అక్కను చూసేందుకు మహారాష్ట్ర నుంచి మనోజ్ ఆదిలాబాద్‌కు వచ్చాడు. తేనీరు తాగుదామని బావమరిది మనోజ్‌ను బయటకు తీసుకువేళ్లిన బావ సంతోష్ పథకం ప్రకారం గొంతుకోసి నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున జనం రావటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు సురేష్, శ్రీనివాస్ అక్కడికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
