close

తాజా వార్తలు

బాయిలర్‌ పేలి నలుగురి మృతి


పట్నా: ఒక ఎన్జీవో సంస్థ కోసం మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌లోని పట్నా సమీపంలోని చంపారన్‌ సుగౌలి బ్లాక్‌లో ఓ ఎన్జీవో సంస్థ కోసం శనివారం తెల్లవారుజామున మధ్యాహ్న భోజనాన్ని తయారీ చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పేలుడు సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారనే సమాచారం లేదు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులను మెరుగైన చికిత్స నిమిత్తం పట్నా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి రామ్‌ చంద్ర సాహ్ని ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై సమీక్షిస్తున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.