
తాజా వార్తలు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సెంథిల్ కుమార్.. ఇన్సెట్లో నిందితుడు రఫీ
చిత్తూరు: ఏపీలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత (6) హత్య కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు అంగళ్లు మొలకవారిపల్లెకు చెందిన లారీ క్లీనర్ రఫీ (25)గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల 7న కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ చేనేతనగర్‌లోని కల్యాణ మండపం వద్ద వర్షిత హత్యకు గురైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హత్యకేసు వివరాలను జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ వెల్లడించారు.
పాపకు చాక్లెట్ ఆశ చూపించి తన వెంట నిందితుడు తీసుకెళ్లాడని ఎస్పీ చెప్పారు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హతమార్చాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, ఊహాచిత్రాల సాయంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. నిందితుడి రఫీ చిన్నతనంలోనే బాల నేరస్థుడుగా జైలు జీవితం గడిపాడని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రఫీని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నామని ఎస్పీ తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
