close

తాజా వార్తలు

తెదేపా పార్లమెంట్‌ కమిటీల నియామకం

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా గత కొంతకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్లమెంట్ కమిటీలను నియమించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై 8 స్థానాలకు కమిటీలను నిర్ణయించారు. ఈ మేరకు తెదేపా ఓ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్‌కి యాద గౌడ్, పెద్దపల్లి- సంజయ్, మహబూబ్‌నగర్‌- కొండపల్లి రాంచందర్ రావు,  నల్గొండ- నెల్లూరు దుర్గా ప్రసాద్, మెదక్‌- ఇల్లందు రమేష్, జహీరాబాద్- పైడి గోపాల్‌రెడ్డి, మల్కాజిగిరి- కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కరీంనగర్‌కి జోజి రెడ్డి పార్లమెంట్ కమిటీ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం జటిలం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీలో వల్లభనేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. పవిత్రమైన దుస్తుల్లో ఉండి అలా మాట్లాడడం సరికాదన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.