
తాజా వార్తలు
మహిళా ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లపై దాడి
బంజారాహిల్స్ ఠాణాలో మహిళ రభస
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో శనివారం ఓ మహిళ నానా రభస చేసింది. మహిళా ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లపై దాడి చేసింది. బంజారాహిల్స్ జహీరానగర్ ప్రాంతంలో లీసా అనే మహిళ మద్యం మత్తులో పడి ఉంది. బంజారాహిల్స్ పోలీసులు ఆమెను ఠాణాకు తీసుకొచ్చారు. తేరుకున్న ఆమె పోలీసులతో గొడవకు దిగి, పారిపోయేందుకు ప్రయత్నించింది. మహిళా ఎస్సైతోపాటు ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. బూతులు తిట్టింది. ఒక కానిస్టేబుల్ చేతిని కొరికి, మరో కానిస్టేబుల్ మెడపై రక్కింది. కాసేపటి తరువాత మహిళా పోలీసులు ఆమెను గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టారు. పోలీసుల అంతు చూస్తానంటూ బెదిరించింది. ఆమె వివరాలు తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పేరుతో పాటు నాగాలాండ్ ప్రాంతమని, మాదాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇతర వివరాలు లభించలేదు. ఆమె మాదకద్రవ్యాలు తీసుకుందా, మద్యం మత్తులో ఉందా అనేది తెలియాల్సి ఉంది. మత్తు పూర్తిగా దిగిన తరువాత వివరాలు తెలుసుకొని ఆమె సంబంధీకులకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు వివరించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
