close

తాజా వార్తలు

ప్రేమజంట ఆత్మహత్య

కథలాపూర్‌లో సంఘటన

కథలాపూర్‌, న్యూస్‌టుడే(కరీంనగర్‌): కొంత కాలంగా ప్రేమించుకున్న ఆ యువతీ యువకులు పెద్దల నిర్ణయానికి బలైపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం ఆనందంగా గడుపుదామనుకున్న క్షణాలు ఆత్మహత్య రూపంలో ఆవిరైపోయాయి. కలిసి జీవించలేకున్నా మరణంతోనే ఏకమవుదామని తనువు చాలించారు. దీంతో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించి తమకు పేరు తీసుకువస్తారనే తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కథలాపూర్‌ మండల కేంద్రంలో శనివారం ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మండలంలోని రాజారాంతండాకు చెందిన బూక్య తిరుపతి, బుల్లిల కూతురు బూక్య శిరీష(19), అదే గ్రామానికి చెందిన లావుడ్య సూర్య, ప్రేమల కొడుకు మహిపాల్‌ (21) ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో మహిపాల్‌తో పెళ్లి చేసుకోవాలని శిరీష తల్లిదండ్రులు అడగగా చదువు పూర్తయ్యాక చేసుకుంటాడని చెప్పి తిరస్కరించారు. మరోవైపు శిరీషకు రుద్రంగి మండలం మనాలకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమికులు శనివారం కథలాపూర్‌ శివారులోని నిర్మాణుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందారు. తమ పిల్లలు కళ్లెదుటే విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలంలో ఇద్దరి దుస్తులు, పుస్తకాలు లభ్యమయ్యాయి.  సంఘటన స్థలాన్ని మెట్‌పల్లి సీఐ రవికుమార్‌, కథలాపూర్‌ ఎస్‌ఐ రాజప్రమీల పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.