close

తాజా వార్తలు

సినీ ఫక్కీలో యువకుడి అపహరణ

రాయ్‌చూర్‌ : కర్ణాటకలో ఓ వ్యక్తిని దుండగులు సినీఫక్కీలో అపహరించారు. రాయ్‌చూర్‌ జిల్లాలోని సింగనూర్‌లో రోడ్డు పక్కన నిల్చున్న ఓ వ్యక్తితో మొదట మాటలు కలిపిన దుండగులు.. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే అపహరించారు. అపహరణకు గురైన యువకుడు తీవ్రంగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు  విడిపించేందుకు ప్రయత్నించగా..  వారిని కత్తులు, తుపాకులతో బెదిరించిన దుండగులు ఆ యువకుడ్ని ఎత్తుకుపోయారు. స్థానికంగా ఉన్న ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అపహరణకు ఉపయోగించిన వాహనం మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.