
తాజా వార్తలు
శ్రీనగర్: కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఒక జవాన్ మృతి చెందారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. రక్షణ శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. అఖ్నూర్ సెక్టార్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని పల్లన్వాలా ప్రాంతంలో జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద ఐఈడీ పేలుడు చోటుచేసుకుంది. ఇందులో హవల్దార్ సంతోష్‌కుమార్ అనే జవాను మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. సంతోష్‌కుమార్‌ను అగ్రాలోని బదౌరియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. సరిహద్దులోని ఫెన్సింగ్ వద్ద పేలుడు చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
