
తాజా వార్తలు
జీడిమెట్ల: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న అన్వర్, అంబరీష్‌ను పోలీసులు, అగ్నిమాక సిబ్బంది బయటకు తీశారు. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన అన్వర్, అంబరీష్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. రసాయన పరిశ్రమ కావడంతో పేలుడు తీవ్రతకు వాయువులు వెలువడి సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు కష్టంగా మారింది. భారీ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. శకలాలు 500 మీటర్ల దూరం వరకు ఎగిరిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈపరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడుతున్నాయని గతంలో కాలుష్య నియంత్రణ మండలి, పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
