
తాజా వార్తలు
నాలుగేళ్లకు పట్టుబడిన అత్యాచారయత్నం కేసు నిందితుడు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: నాలుగేళ్ల క్రితం పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్సై కన్నెబోయిన ఉదయ్ కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని ఇందిరానగర్‌లో నివసించే ఓ బాలిక నాలుగేళ్ల క్రితం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా సమీపంలో నివసించే దర్జీ దుర్గారావు (45) చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం దుర్గారావు పరారయ్యాడు. మహారాష్ట్ర, బిహార్ తదితర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నాడు. నాలుగేళ్లు గడవడంతో పోలీసులు మరిచిపోయి ఉంటారని భావించిన దుర్గారావు తన సొంతూరైన జంగారెడ్డిగూడెం వెళ్లాడు. తన పాత చరవాణిలో కొత్త సిమ్ కార్డు వేశాడు. ఐఎంఈఐ నెంబరు ఆధారంగా నిందితుడు జంగారెడ్డిగూడెంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై ఉదయ్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి వెళ్లి దుర్గారావును పట్టుకొని అరెస్టు చేశారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
