close

తాజా వార్తలు

టిక్‌టాక్‌ కోసం తుపాకీ కొని..

మధ్యప్రదేశ్‌: టిక్‌టాక్‌ వ్యసనం వెర్రితలలు వేస్తోంది. ఎక్కువ లైక్‌ల కోసం నేరాలను చేసేందుకు కూడా వెనుకాడటంలేదు. చివరకు కటకటాలపాలవుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని మాంద్‌సౌర్‌ జిల్లా మల్హాగర్‌కు చెందిన ఇద్దరు యువకులు టిక్‌టాక్‌ వీడియోల కోసం రూ.25వేలు చెల్లించి ఏకంగా తుపాకీని కొనుగోలు చేశారు. అనంతరం దానిని పట్టుకుని ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ టిక్‌టాక్‌ వీడియోను రూపొందించారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరి యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ లైక్‌లు పొందేందుకు ఇలా చేశామని ఆ యువకులు పోలీసులకు వెల్లడించారు. ప్రత్యేక సైబర్‌ బృందాలు సామాజిక మాధ్యమాలను నిత్యం పర్యవేక్షిస్తాయని.. యువత నేరాలకు పాల్పడవద్దని మాంద్‌సౌర్‌ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.