
తాజా వార్తలు
రాయదుర్గం (హైదరాబాద్): రాయదుర్గంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఓ సాఫ్ట్వేర్ సంస్థ నోటీసులు జారీ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరిణి (24) ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై రాయదుర్గం ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి సైబర్హిల్స్లోని వసతిగృహంలో ఉంటున్న హరిణి మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదనపు సిబ్బందిని తొలగించే క్రమంలో ఆ సంస్థ కొంతమంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు డిసెంబర్ 1వ తేదీ వరకు గడువు విధించింది. నోటీసులు అందుకున్న వారిలో హరిణి కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగం కోల్పోతే తనకు వేరే సంస్థలో ఉద్యోగం దొరుకుతుందో.. లేదో అన్న ఆందోళనతో మంగళవారం రాత్రి తాను ఉంటున్న వసతి గృహంలోని తన గదిలో ఉరి వేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని జగదాంబనగర్ కాలనీకి చెందిన హరిణి బీటెక్ పూర్తి చేసుకుని రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
