close

తాజా వార్తలు

స్వామి నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదు

అహ్మదాబాద్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఆయన అనుచరులు పిల్లల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అహ్మదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అహ్మదాబాద్‌లోని ఆయన అనుచరులైన  సాధ్వీ ప్రణప్రియానంద, ప్రియతత్వ రిద్ది కిరణ్‌ అనే మహిళల్ని అరెస్టు చేశారు. వీరిద్దరూ ‘యోగిని సర్వగ్యపీఠం’ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ మహిళలు నలుగురు చిన్నారులను కిడ్నాప్‌ చేసి ఓ ఫ్లాట్‌లో అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా ఆ చిన్నారులను బాలకార్మికులుగా మార్చి వారితో ఆశ్రమ ప్రచార కార్యకలాపాలు, డొనేషన్ల వసూళ్లకు వాడుకుంటున్నారు. ఫ్లాట్‌ నుంచి రక్షించిన చిన్నారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిత్యానంద స్వామిపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.