
తాజా వార్తలు
దిల్లీ: దేశ రాజధానిలోని అమ్మకపు పన్ను కార్యాలయంలో (సేల్స్ టాక్స్ కార్యాలయం) గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆదాయపు పన్ను కార్యాలయ భవంతి 13వ అంతస్తులోని సేల్స్‌టాక్స్ కార్యాలయంలో తొలుత మంటలను గమనించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినట్లు తెలియరాలేదు. ‘‘ఆదాయపు పన్ను కార్యాలయ భవంతిలో 13వ అంతస్తులో ఉన్న సేల్స్ టాక్స్ కార్యాలయంలోని 115వ నంబరు గదిలో మంటలు మొదలయినట్లు తొలుత గుర్తించారు. మాకు ఈ ఉదయం 8:36 గంటల సమయంలో మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లి మంటలను ఆర్పివేశాం...’’ అని దిల్లీ అగ్ని మాపక కార్యాలయం ముఖ్యాధికారి అతుల్ గార్గ్ తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో కూడా ఆదాయపు పన్ను కార్యాలయ భవనానికి అతి సమీపంలోని మరో భవనంలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
