
తాజా వార్తలు
పూసపాటిరేగ: మనస్తాపంతో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, బస్సు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యపరీక్షల నిమిత్తం ఓ వ్యక్తి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం చేరుకునేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా వెళ్తున్న బస్సులోంచి దూకేశాడు. దీంతో అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దూకే ప్రయత్నంలో బస్సులో ఉన్నవారు అతడిని ఆపేందుకు ప్రయత్నంచినా ఫలితం లేకపోయిందని కండక్టర్, ప్రయాణికులు తెలిపారు. సమాచారమందుకున్న పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడి వద్ద ఆరోగ్య పరీక్షల రిపోర్టులు ఉన్నాయి.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
