
తాజా వార్తలు
అనుప్పూర్ (మధ్యప్రదేశ్): ఒక మహిళ తన భర్తను చంపి, వంటగది గట్టు కింద పాతి పెట్టడమే కాకుండా నెలరోజులుగా అక్కడే వంట చేసుకుని తింటున్న భయంకర సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లా, కరోండి గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ బన్వాల్ (35) అనే న్యాయవాది, అక్టోబరు 22 నుంచి కనపడకుండా పోయాడు. అతని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్న అర్జున్ బన్వాల్ పోలీసులను సంప్రదించటంతో కథ మలుపు తిరిగింది. తమ్ముడు కనిపించకుండా పోయిన రోజు నుంచి అతని ఇంటికి వెళ్దామని అనుకున్న తమను, ప్రమీల లోపలికి రానివ్వటం లేదంటూ అర్జున్ తెలిపాడు. దానితో మహేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ దుర్వాసన వస్తున్నట్టు గుర్తించారు.
‘‘ఆ వాసన ఇంటిలో నుంచే వస్తోందని మాకు అర్థం అయింది. అనుమానంతో ఇంటిని తనిఖీ చేయడం మొదలుపెట్టాం. ఆఖరికి వాసన వంటగదిలో నుంచి వస్తోందని గుర్తించాం.’’ అని స్టేషన్ అధికారి భానుప్రతాప్ సింగ్ తెలిపారు. అక్కడ తవ్విన పోలీసులు, నెల రోజులుగా ప్రమీల వంట చేస్తున్న గట్టు కింద, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహేష్ శవాన్ని వెలికితీశారు. తన గుట్టు బయట పడటంతో ప్రమీల ఏడుస్తూ మహేష్ పెద్ద అన్న గంగారాం బన్వాల్ ఈ నేరం చేయడానికి తనకు సహాయం చేశాడని చెప్పింది. గంగారాం భార్యతో మహేష్‌కు సంబంధముందని, అందుకే అతనిని చంపడానికి పథకం వేశాడని ఆమె ఆరోపించింది. ప్రమీలను అరెస్టు చేసిన పోలీసులు కేసు విచారణను చేపట్టారు. నిందితురాలైన ప్రమీల ఒక్కతే వంటగదిలో గొయ్యి తవ్వి తన భర్తను ఎలా పాతిపెట్టగలదని వారు అంటున్నారు. దీనికి ఎవరో సహకరించి ఉంటారని, అది ఎవరో తెలుసుకోవడానికి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
