
తాజా వార్తలు
అహ్మదాబాద్ : వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి ఆశ్రమంలో తాను మానసిక క్షోభ అనుభవించానని బెంగళూరుకు చెందిన ఓ బాలిక(15)వాపోయింది. బాలిక తల్లిదండ్రులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించడంతో గత నెలలోనే ఆమె ఆశ్రమం నుంచి బయటపడింది. నిత్యానంద విదేశాలకు పారిపోయాడన్న వార్తల నేపథ్యంలో బాలిక మీడియాతో మాట్లాడుతూ.. ‘2013 మేలో నేను గురుకులంలో చేరాను. ప్రారంభంలో మేము ఆనందకరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. అయితే 2017 నుంచి అక్కడ అవినీతి జరుగుతోంది. స్వామిజీ కోసం వ్యాపార ప్రకటనలు చేసే వాళ్లం. అందువల్ల వేలల్లో కాదు లక్షల్లో విరాళాలు వచ్చేవి. ఆ విరాళాలు రూ.3లక్షలతో మొదలై రూ.8కోట్ల వరకూ ఉండేవి. డబ్బులు కాకపోతే ఎకరాల్లో భూమి విరాళంగా వచ్చేదని’ ఆ బాలిక వివరించింది.
‘కొన్ని సార్లు నడిరాత్రిలో నిద్రలేపి స్వామీజీ కోసం వీడియోలు చేయాలని చెప్పేవారు. ఆ సమయంలో ఎక్కువ నగలు ధరించి మేకప్ వేసుకునే వాళ్లం. నా సోదరి ఇంకా అక్కడే ఉంది. మా సోదరి వీడియోలన్నీ స్వామీజీ ఆదేశాల ప్రకారమే చేసిందనడానికి నేనే సాక్ష్యం. మా తల్లిదండ్రుల గురించి చెడుగా చెప్పమని కూడా ఆమెను ఆజ్ఞాపించేవారు. నన్ను కూడా ఆ పని చేయమంటే తిరస్కరించానని’ ఆశ్రమంలో జరుగుతున్న తంతును బాలిక చెప్పుకొచ్చింది.
ఆధ్యాత్మిక ప్రక్రియ పేరుతో తనను రెండు నెలల పాటు ఓ గదిలో బంధించారని కూడా ఆ బాలిక ఆరోపించింది. ఆశ్రమంలో పనిచేసే వాళ్లంతా అసభ్య పదజాలంతో దూషించే వారని చెప్పింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో చిక్కుకున్న తన మరో కూతుర్ని విడిపించాలని కోరుతూ బాలిక తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారని బాలిక తండ్రి తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
