close

తాజా వార్తలు

ఆదిపరాశక్తిలా మారండి

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓ మహిళ తనని తాను కాపాడుకోవాలంటే ఆత్మరక్షణ పద్ధతులు కొన్నయినా తెలిసుండాలి. ఆ మెలకువలనే సూచిస్తున్నారు హైదరాబాద్‌లోని రాణి రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకురాలు లక్ష్మీ సామ్రాజ్యం.

దైనా ప్రమాదం వాటిల్లుతోందనే విషయం గుర్తించగానే మొదట చేయాల్సింది అక్కడి నుంచి బయటపడి జనాలున్న చోటుకు వెళ్లడం. లేదా గట్టిగా అరవడం. ఇవన్నీ సాధ్యం కానప్పుడు మన శరీరాన్నే ఆయుధంగా మార్చుకోవాలి. ఎదురుగా వచ్చి కదలకుండా గట్టిగా పట్టుకున్న వ్యక్తి కళ్లలో... వేళ్లతో బలమంతా ఉపయోగించి పొడవాలి. దీనికోసం   కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సమయస్ఫూర్తి ఉంటే చాలు. పిడికిలి బిగించి గట్టిగా ముక్కు మీద దాడిచేసినా చాలు.
* మన దగ్గరకు వచ్చి మెడ పట్టుకున్నా... చేతులు పట్టుకున్నా... అరచేతులతో అవతలి వ్యక్తి చెవుల మీద గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించాలి. జుట్టును పట్టుకుంటే మీ చేతులతో అతడి ముఖం మీద పిడి గుద్దులు కురిపించాలి. చేతులు కదల్లేని స్థితిలో ఉంటే కాళ్లతో ఎదుర్కోవాలి. సాధారణంగా ఎవరైనా హఠాత్తుగా దాడిచేస్తే వెంటనే షాక్‌కు గురవుతారు. ఆ తరువాత విడిచిపెట్టమని ప్రాధేయపడుతూ బేలగా మారతారు. అలా అస్సలు చేయకూడదు. ఎదుటివ్యక్తి వెనుక నుంచి వచ్చి పట్టుకోగానే మీ బలాన్ని ఒక్కసారిగా చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. గొంతు మధ్యలో గట్టిగా నొక్కినా   విలవిల్లాడి మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ క్షణంలో తప్పించుకోవచ్చు. చేతులు తీయడానికి వీలు లేకపోతే కాళ్లతో గట్టిగా అతడి జననేంద్రియాలపై తన్నాలి.
* వెనుక నుంచి వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే... వెంటనే కిందికి జారిపోయి ఆ వ్యక్తి కాళ్లను పట్టుకుని లాగినా చాలు. 

ఒకరి కంటే ఎక్కువగా ఉంటే...
మొదట... చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనించండి. ఒక్కసారిగా గుప్పెడు మట్టి తీసుకుని ఎదుటివారి కళ్లలోకి చల్లేలా చూడండి. వాళ్లలో ఒకరిని ఎదిరించినా మిగతావారు వెనుకడుగు వేస్తారు. మీ చేతిని పట్టుకుంటే... వదిలించుకోవడానికి బదులుగా అతడి మణికట్టుపై మీ రెండో చేత్తో గట్టిగా కొట్టండి.
* ఎదుటివ్యక్తి వల్ల మనకు హాని జరగబోతుందని తెలిసినప్పుడు ఏడవడం, బతిమాలడం కాకుండా ధైర్యంగా దెబ్బతీయడానికి అడుగేయాలి. అవతలివ్యక్తి బలహీన భాగాలపై దెబ్బ కొట్టేందుకు సిద్ధమవ్వాలి. 

ఈ జాగ్రత్తలే కాదు... కొన్ని గ్యాడ్జెట్లనూ అందుబాటులో ఉంచుకుంటే అత్యవసర సమయంలో ఉపయోగపడతాయి. అవేంటంటే...

ఇవీ ముఖ్యమే

* కాలర్‌ బోన్‌ దగ్గర రెండు వేళ్లతో నొక్కితే ప్రాణం పోయినంతపనవుతుంది. మోచేయి భాగంలోని నాడులను గట్టిగా నొక్కితే బాధతో విలవిల్లాడటం ఖాయం. మణికట్టు అడుగున మన చేతి పిడికిలి బిగించి నరాలపై కొట్టినా చాలు.
* మీ బ్యాగు, బండి తాళంచెవి, గొడుగు, తలపిన్ను సైతం మిమ్మల్ని కాపాడతాయి. చేతికందిన రాయి, వస్తువు దేంతోనైనా సరే.. ఎదుటి వ్యక్తిపై దాడి చేయాలి.

* పెప్పర్‌ స్ప్రే, చిల్లీ స్ప్రే- లిప్‌స్టిక్‌ సైజు నుంచి సౌందర్య ఉత్పత్తుల్లా ఉన్నాయి. ఎవరైనా దాడికి ప్రయత్నించినప్పుడు వాటితో ఎదుటి వారి కళ్లల్లో స్ప్రే చేస్తే చాలు. ఆ గాఢత నుంచి తేరుకోవడానికి పది నిమిషాల సమయం పడుతుంది.

* సెల్ఫ్‌ డిఫెన్స్‌ టార్చ్‌... విద్యుత్తును ప్రసరింపజేసి కొన్ని నిమిషాలు ఎదుటి వారిని అచేతనంగా చేస్తుంది. అఘాయిత్యాలకు పాల్పడే వారిని నిలువరిస్తుంది.

* అత్యవసర సమయంలో అలారం మోగించే కీచైన్‌ని తాళాలగుత్తికి పెట్టుకోవచ్చు. దీనికి ఉండే బటన్‌ను నొక్కితే అలారం మోగుతుంది. చుట్టుపక్కల వారికి మనం ఆపదలో ఉన్నామనే సందేశం అందుతుంది.

* చిన్నపాటి మెటల్‌ స్టీల్‌ రాడ్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో దాడి చేస్తే దెబ్బ నుంచి తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది.

ఇవన్నీ ఆన్‌లైన్‌ స్టోర్లలో లభిస్తాయి. వీటి ధరలు వెయ్యి రూపాయల్లోనే ఉంటాయి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.