close

తాజా వార్తలు

మెడకీ ఓ పూత

ముఖంపై చూపే శ్రద్ధ మెడపై చూపరు కొందరు. దాంతో ఆ ప్రాంతమంతా  నల్లగా మారుతుంది. ఈ సమస్యను ఎలా వదిలించుకోవచ్చంటే...

* పచ్చి బొప్పాయి ముద్దలో చెంచా చొప్పున గులాబీ నీరు, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి... పావుగంటయ్యాక కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే మెడ నలుపుదనం తగ్గుతుంది.
* చెంచా చొప్పున నిమ్మరసం, తేనె తీసుకుని రెండింటినీ కలిపి మెడకు రాసుకోవాలి. తరువాత మృదువుగా మర్దన చేసి... పది నిమిషాలయ్యాక కడిగేయాలి. తేనె తేమనందిస్తే, నిమ్మరసం నలుపును పోగొడుతుంది.
*  రెండు చెంచాల వంటసోడాలో   కాసిని నీళ్లు కలిపి మెడకు రాసుకోవాలి. అయిదు నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసినా ఫలితం ఉంటుంది.
* రెండు చెంచాల సెనగపిండిలో చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెడకు రాసుకోవాలి. పది నిమిషాలు మృదువుగా మర్దన చేసి తరువాత కడిగేస్తే చాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.