close

తాజా వార్తలు

నచ్చితే ఇచ్చేయండి

పుట్టిన రోజుకో.. పండక్కో... ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తూ ఆనందపరుస్తాం. వచ్చేదంతా పండగల సీజన్‌. మరైతే, ఎలాంటి గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఇవిగోండి కొన్ని.. టెక్నాలజీ ప్రియుల మనసు దోచుకున్నవి..

వైర్‌లెస్‌గా..
Powerbeats Pro

నాజూకుగా భిన్నమైన డిజైన్‌లా కనిపిస్తాయీ ఇయర్‌ఫోన్స్‌. నాణ్యమైన సౌండ్‌ క్లారిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడూ అనుకూలంగా ఉంటాయి. 33 అడుగుల పరిధిలో వైర్‌లెస్‌గా ఫోన్‌తో జతకడుతుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 9 గంటలు వినియోగించుకోవచ్చు. ఛార్జింగ్‌ కేస్‌ సదుపాయం ఉంది. నాలుగు రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లను సపోర్టు చేస్తుంది.

కెమెరా పెన్ను..
Neo smartpen

చూడ్డానికి మామూలు పెన్నులా కనిపిస్తున్నా.. ఇదో స్మార్ట్‌ పెన్ను. దీంతో రాసిన నోట్స్‌ ఆటోమేటిక్‌గా డిజిటల్‌ టెక్స్ట్‌ రూపంలో వాడే ఫోన్‌ లేదా ట్యాబ్‌లోకి వెళ్లిపోతుంది. పెన్ను పాళీ దగ్గర ఏర్పాటు చేసిన కెమెరాతో రాసింది రాసినట్టే స్కాన్‌ అయ్యి ఫోన్‌లోకి వెళ్లిపోతుంది. క్యాప్‌ ఓపెన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. మూత పెడితే ఆఫ్‌ అయిపోతుంది. మైక్రో యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్‌ చేయొచ్చు. నియో నోట్స్‌ యాప్‌లో డిజిటల్‌ టెక్స్ట్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.

రెండింటినీ ఒకేసారి
courant CATCH:2

ఒకటి కాదు. రెండు ఫోన్‌లు వాడేస్తున్నారు. మరి, రెండింటినీ వైర్‌లెస్‌గా ఛార్జ్‌ చేయాలంటే? ఇది అందుకు తగినది. మల్టీ ఛార్జింగ్‌ డివైజ్‌. వైర్‌లెస్‌గా రెండు ఫోన్‌లను ఒకేసారి ఛార్జ్‌ చేసుకోవచ్చు. వేగంగా ఛార్జింగ్‌ చేయగలగడం దీని ప్రత్యేకత. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను సపోర్టు చేస్తుంది.

అదిరే అద్దం
RIKI SKINNY

అందాన్ని చూపే అద్దాన్ని సంప్రదాయ పద్ధతిలో కాకుండా స్మార్ట్‌గా వాడాలనుకుంటే.. ఇది చక్కని ఎంపిక. దీని చుట్టూ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్‌లు అద్దంలో ముఖాన్ని చాలా స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడతాయి. దీన్ని కేవలం అద్దంలానే కాకుండా మొబైల్‌ హోల్డర్‌గానూ వాడుకోవచ్చు.  అయస్కాంత శక్తితో మొబైల్‌ హోల్డర్‌ని అంటి పట్టుకునేలా చేయొచ్చు. దీనికి ఫోన్‌ని అమర్చుకుంటే సరి. బ్లూటూత్‌తో ఐఫోన్‌కి కనెక్ట్‌ చేసుకొని సెల్ఫీలు దిగొచ్చు.

బుల్లి స్పీకర్‌..
SRS-XB12 EXTRABASS

ఇష్టమైన పాటలు వింటూ వెచ్చని కాఫీ తాగుతుంటే.. ఆ మజానే వేరు. ఎక్స్‌ట్రా బాస్‌తో మ్యూజిక్‌ వినాలనుకుంటే ఈ బ్లూటూత్‌ స్పీకర్‌ని ప్రయత్నించొచ్చు. ఆరు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. తడిసినా పాడవదు. వాటర్‌ప్రూఫ్‌ రక్షణ కవచం ఉంది. దుమ్ము చేరనీయకుండా డస్ట్‌ప్రూఫ్‌ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 16గంటలు పాటలు వినొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.